English | Telugu
తినడానికి డబ్బులు లేవు.. ప్రముఖ హీరో సంచలన స్పీచ్
Updated : Jul 12, 2025
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)త్రిపాత్రాభినయం చేసిన మూవీ 'జై లవకుశ'(jai lava kusa). 2017 వ సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లలో ఎన్టీఆర్ తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు, అభిమానులకి కూడా ఒక మెమొరీబిల్ మూవీగా నిలిచింది. ఈ మూవీ ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ నటుడు 'రోనీత్ రాయ్'(Ronit Roy). 'సర్కార్ సాహై' అనే ప్రతి నాయకుడి క్యారక్టర్ లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా వచ్చిన 'లైగర్' లో కూడా క్రిస్టోఫర్ అనే కోచ్ పాత్ర రోనీత్ కి మంచి గుర్తింపుని తెచ్చింది.
రీసెంట్ గా రోనీత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు సినిమాల్లోకి రాకముందు కడుపునిండా తినడానికి సరిపడా డబ్బులు ఉండేవి కావు. దీంతో కొన్ని సార్లు ఒక్కపూట మాత్రమే భోజనం చేసేవాడిని. బాంద్రా స్టేషన్ రోడ్ లో ఉండే ధాబాలో రోజు రెండు రోటీలు, కూర తినేవాడ్ని.ఒకసారి నా వద్ద డబ్బుల్లేక రోటీలు మాత్రమే తీసుకుంటే, ఓనర్ గమనించి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. రోజు తినే లాగానే తినండని కూర కూడా ఇచ్చాడు. అతని ముఖం ఇంకా గుర్తు ఉందంటు రోనీత్ కన్నీళ్లతో చెప్పుకొచ్చాడు.
1992 లో విడుదలైన 'జానే తేరే నామ్'(Jaane tere Naam)అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన రోనీత్ రాయ్ ఆ తర్వాత హీరో, క్యారక్టర్ ఆర్టిస్ట్ విలన్ గా పలు భాషల్లో సుమారు అరవై చిత్రాల వరకు చేసాడు. రీసెంట్ గా గత నెల 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మైథలాజికల్ హర్రర్ ఫిలిం 'మా' లో జోయ్ దేవ్ పాత్రలో మరోసారి మెప్పించాడు. కాజోల్ (Kajol)ప్రధాన పాత్రలో 'మా'(Maa)మూవీ తెరకెక్కింది.
