English | Telugu

రాబిన్ హుడ్ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే!

నితిన్(Nithinn)శ్రీలీల(Sreeleela)జంటగా ఛలో,భీష్మ వంటి హిట్ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుముల(Venki Kudumula)దర్శకత్వంలో తెరకెక్కిన 'రాబిన్ హుడ్'(Robinhood)నిన్నవరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టింది.యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్అధినేతలు నవీన్ఎర్నేని,రవిశంకర్ యలమంచి ఎంటైర్ నితిన్ కెరీర్ లోనే హైబడ్జెట్ తో తెరకెక్కించారు.

ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా 2 .65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఏ పి తెలంగాణాలో కలిపి 2 .3 కోట్లు,తమిళనాడులో 4 లక్షలు,కర్ణాటక లో 25 లక్షలు,రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 లక్షలు ఇలా మొత్తం 2 .65 కోట్లు గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వారు చెప్తున్నారు.మూవీ చూసిన ప్రేక్షకులు అయితే నితిన్,శ్రీలీలతో పాటు మిగతా ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ చాలా బాగుందని,ముఖ్యంగా కామెడీ ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉందని అంటున్నారు.

ప్రముఖ హీరోయిన్ కేతిక శర్మ(ketika Sharma)ఒక ప్రత్యేక గీతంలో నటించగా రాజేంద్ర ప్రసాద్,వెన్నెల కిషోర్,షైన్ టామ్ చాకో,బ్రహ్మాజీ,శుభలేఖ సుధాకర్,మైమ్ గోపి,లాల్,ఆడు కాలం నరేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.సాయిశ్రీరామ్ కెమెరా బాధ్యతలని నిర్వహించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.