English | Telugu

సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ!

ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఆయన ఇంట్లో పని చేసే నాయక్ అనే వ్యక్తి రూ. 10 లక్షలతో పారిపోయాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు, చోరీకి పాల్పడిన పని మనిషి నాయక్ పై మోహన్ బాబు రాచకొండ పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నాయక్ ని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

గతంలోనూ మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. 2019లో డబ్బులు, బంగారు ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, 2022లో మోహన్‌ బాబు పెద్ద కుమారుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలోనూ చోరీ జరిగింది. ఆ సమయంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.