English | Telugu

మేం విడిపోలేదు-రేణూ దేశాయ్

"మేం విడిపోలేదు" అని రేణూ దేశాయ్ మీడియాకు తెలియజేశారట. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కలసి కొన్నాళ్ళు సహజీవనం చేసి, ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయనీ, వాళ్ళిద్దరూ విడిపోయారనీ మీడియాలో బాగా వినపడింది. అందుకు పవన్ కళ్యాణ్ ఆవిడకి విడాకుల కోసం ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారని కూడా మీడియా ఘోషించింది. కానీ అవన్నీ వొట్టి పుకార్లేననీ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదనీ పవన్ కళ్యాణ్ భార్య రేణూ దేశాయ్ స్పష్టం చేశారు.

రేణూదేశాయ్ ఈ విషయంపై స్పందిస్తూ " మేం విడిపోయామన్న వార్త పూర్తిగా అవాస్తవం. ఇలాంటి ఆధారరహిత వార్తలను మీడియా ఎలా ప్రచారం చేస్తుందో నాకర్థం కాదు. ఏదో సంచల వార్త కావాలి కాబట్టి ఒక ప్రముఖ హీరో కనుక పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి అబద్ధాలను చెప్పి వాళ్ళ టి.ఆర్.పి. రేటింగ్ పెంచుకోవటం ఎంతవరకూ సమంజసమో మీడియానే చెప్పాలి. ఇలాంటి వార్తల ప్రభావం నా ఇద్దరు పిల్లల మీద పడుతుంది. వాళ్ళ పసిమనస్సులు దీనికి ఎలా స్పందిస్తాయో మీడియాకు అర్థం కాదు. దయచేసి ఇప్పటికైనా మీ ఛానల్స్ కోసం ఎదుటివారిమీద నిరాధారమైన ఆరోణలు మానుకోవాలను సూచిస్తున్నా" అని అన్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.