English | Telugu

రజనీ హాస్పిటల్లో హాయిగా ఉన్నారు- మోడీ

"రజనీ హాస్పిటల్లో హాయిగా ఉన్నారు" అని మోడీ అన్నారట. వివరాల్లోకి వెళితే సౌతిండియన్‍ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ మధ్య స్వల్ప అనారోగ్యంతో శ్రీ రామచంద్ర హాస్పిటల్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. రజనీ కాంత్ ని పరామర్శించటానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, అలాగే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తమిళనాడులోని చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ కి ఎవరికి వారు విడి విడిగా వెళ్ళటం జరిగింది.

రజనీ కాంత్ ని పరామర్శించి, ఆయన ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్న అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మీడియాతో మాట్లాడుతూ " నాకు తెలిసి రజనీ కాంత్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే రజనీ కాంత్ హాస్పిటల్లో సరదాగా శలవులు గడుపుతున్నట్లుగా ఉంది. ఆయన చాలా చలాకీగా జోక్స్ కూడా వేసి నన్ను నవ్వించారు" అని అన్నారు. అదండీ రజనీ కాంత్ ఆరోగ్య పరిస్థతి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.