English | Telugu
ఆ ముద్దుగుమ్మలు ఇరగదీశారు
Updated : Dec 20, 2014
ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో పంజాబీ ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్ సింగ్, ముంబై చిన్నది రెజీనా అత్యధిక చిత్రాల్లో నటించి తమ సత్తాను చాటుకున్నారు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో ఫస్ట్ హిట్ అందుకుంది 'రకుల్ ప్రీత్ సింగ్'. ఈసినిమా ఇచ్చిన కిక్ తో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ రేస్ లోకి ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్తోంది. ఈ సంవత్సరం లౌక్యం, కరెంట్ తీగ, 'రఫ్' సినిమాలలో నటించగా, అందులో లౌక్యం, కరెంట్‌తీగ హిట్ సాధించగా, రఫ్ సినిమా ఫ్లాప్ అయింది. అలాగే రామ్ సరసన పండగ చేస్కో, రవితేజ సరసన కిక్-2 సినిమాలో నటిస్తోంది. ఈ బ్యూటీకి వస్తున్న ఆఫర్లు చూస్తుంటే త్వరలోనే టాప్ హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముంబై భామ రెజీనా ఈ సంవత్సరం మెగా హీరో అల్లు శిరీష్ తో 'కొత్తజంట'తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన రెజీనాకి మాత్రం ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ తరువాత టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపొయింది ఈ అమ్మడు. రవితేజ తో 'పవర్', సందీప్ కిషన్ తో 'రారాకృష్ణయ్య', సాయిధరమ్ తేజ్ తో 'పిల్లానువ్వులేని జీవితం', అల్లు అర్జున్ తో ఓ యాడ్ లో కలిసి పనిచేసింది. వీటిలో పవర్, 'పిల్లానువ్వులేని జీవితం' హిట్ సాధించగా, రారాకృష్ణయ్య యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఐదు సినిమాలు వున్నాయట. ఈ అమ్మడి యాక్టింగ్ టాలెంట్, వస్తున్న ఆఫర్లు చూస్తుంటే స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమని అంటున్నారు.