English | Telugu

వామ్మో రెజీనా.. ముదిరావ్...

నిన్నగాక మొన్న మొన్న హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెజీనా చలాకీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. రెజీనా ఎంత చలాకీదంటే, రెండు మూడు సినిమాల్లో చిన్న హీరోల పక్కన నటించి, ఆ తర్వాత రవితేజ లాంటి బిగ్ స్టార్ పక్కన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మొన్నామధ్య అల్లు అర్జున్‌తో కలసి ఒక యాడ్‌లో కూడా నటించిన రెజీనా వరస చూస్తుంటే ఇక ఈ ముద్దుగుమ్మ వరసబెట్టి టాలీవుడ్‌లో పెద్ద హీరోలందరి సరసన నటించేలా వుంది. మాంఛి దూకుడున్న హీరోయిన్ రెజీనా రేపో ఎల్లుండో టాలీవుడ్ నంబర్ వన్ హీరో సరసన నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ పండితులు చెబుతున్నారు. ఇదిలా వుంటే రెండ్రోజుల క్రితం పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రెజీనా చేసిన హాట్ హాట్ కామెంట్లు చూసి టాలీవుడ్ జనం బిత్తరపోతున్నారు. నేను తెరమీద లిప్ టు లిప్ కిస్ ఏనాడో ఇచ్చేశాను.. భవిష్యత్తులో అలాంటి ఆఫర్లు వచ్చినా నో ప్రాబ్లం అని యమా బోల్డుగా చెప్పిన రెజీనాని చూసి బుగ్గలు నొక్కుకుంటున్నారు. రెజీనా ఈ దూకుడుతో వ్యవహరిస్తే అమ్మాయిగారు నంబర్ వన్ హీరోయిన్ స్థానానికి చేరుకోవడానికి ఎంతోకాలం పట్టదని అనుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు.. ఒక్కరైనా రెజీనాలాగా బోల్డ్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారా అంట?! ఏది ఏమైనప్పటికీ... రెజీనా.. నువ్వు ముదిరావ్...!

Regina Cassandra Gallery

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.