English | Telugu

కొత్త చిత్రం ఒప్పుకోవడానికి ఆయనే కారణం..నేర్చుకోవచ్చంటున్న రష్మిక 

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతి తక్కువ వ్యవధిలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగిన నటి ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక అని చెప్పవచ్చు. అలాగే ఆమె ఆ స్థాయికి ఎదగడం వెనుక వెండి తెర మీద ఆమె పండించే అధ్బుతమైన పెర్ ఫార్మెన్స్ నే ముఖ్య కారణం. మొన్నీ ఈ మధ్య వచ్చిన యానిమల్ లో రణబీర్ కి ధీటుగా నటించి మెప్పించిన రష్మిక తాజాగా తన కొత్త చిత్రం హీరో గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచాయి.

రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 తో పాటు ధనుష్ అండ్ నాగార్జున కాంబోలో వస్తున్న కొత్త మూవీలో కూడా నటిస్తుంది. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈమూవీలో రష్మిక ధనుష్ కి జోడిగా జతకడుతుంది. ఈ సందర్భంగా ఆమె ధనుష్ గురించి మాట్లాడుతు ధనుష్ నెంబర్ వన్ ఆర్టిస్ట్ ఆయన నటన నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చని చెప్పింది. ఒక రకంగా చెప్పాలంటే ధనుష్ తో నేను నటించడానికి ప్రధాన కారణం కూడా ఇదే అని రష్మిక చెప్పింది. అలాగే ఆ మూవీ షూటింగ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వచ్చే నెల నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతానని కూడా ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమయిన నాగ్ ,ధనుష్, రష్మిక ల మూవీ కి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకోనున్న ఈ మూవీకి సునీల్ నారంగ్, రామ్ మోహన్ లతో పాటు శేఖర్ కమ్ముల కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.