English | Telugu
రష్మిక ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్!
Updated : Dec 18, 2021
ఎల్. కార్తిక (ఛలో), గీత (గీత గోవిందం), పూజ (దేవదాస్), లిల్లీ (డియర్ కామ్రేడ్), సంస్కృతి (సరిలేరు నీకెవ్వరు), చైత్ర (భీష్మ), శ్రీవల్లి (పుష్ప - ద రైజ్).. ఇలా ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రలతో తెలుగువారిని విశేషంగా అలరించింది కన్నడ కస్తూరి రష్మికా మందన్న. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ చేతిలో `ఆడవాళ్ళు మీకు జోహార్లు`, `పుష్ప - ద రూల్` వంటి టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ ఎప్పటిలానే నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించబోతోంది రష్మిక.
Also read:రష్మికతో రాహుల్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్?
ఇదిలా ఉంటే.. తెలుగునాట ఇప్పటివరకు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో యాక్ట్ చేయని రష్మిక త్వరలో ఆ తరహా చిత్రమొకటి చేయబోతోందట. ఆ వివరాల్లోకి వెళితే.. `చి ల సౌ`, `మన్మథుడు 2` చిత్రాలతో దర్శకుడిగానూ పలకరించిన నటుడు రాహుల్ రవీంద్రన్.. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ కోసం ఓ సినిమా చేయబోతున్నాడట. తన డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూడో సినిమా.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని టాక్. అంతేకాదు.. కథానాయిక పాత్ర చుట్టూ తిరిగే ఈ సినిమాలో రష్మిక లీడ్ రోల్ లో కనిపిస్తుందని బజ్. త్వరలోనే రష్మిక - రాహుల్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది.
మరి.. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో రష్మిక ఎలాంటి గుర్తింపుని, ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.