English | Telugu

కంప్యూటర్ హ్యాకర్గా స్టార్ డైరెక్టర్!

అత‌నో స్టార్ డైరెక్ట‌ర్. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసిన ఆ విల‌క్షణ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు కంప్యూట‌ర్ హాక‌ర్ గా మారాడు. అయితే, ఇదంతా నిజ‌జీవితంలో కాదు. ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ కోసం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `7జీ బృందావ‌న కాల‌నీ`, `ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో తెలుగువారికి శ్రీ రాఘ‌వగా సుప‌రిచితుడైన త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్.. ఇప్పుడు న‌టుడిగా అవ‌తార‌మెత్తిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయ‌న త్వ‌ర‌లో కోలీవుడ్ స్టార్ విజ‌య్ - బుట్టబొమ్మ పూజా హెగ్డే జంట‌గా న‌టించిన `బీస్ట్` కోసం ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. `డాక్ట‌ర్` ఫేమ్ నెల్స‌న్ దిలీప్ కుమార్ రూపొందించిన ఈ సినిమాలో కంప్యూట‌ర్ హాక‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడ‌ట సెల్వ‌రాఘ‌వ‌న్. ఈ పాత్ర సినిమాకి ఓ హైలైట్ గా నిలుస్తుంద‌ని కోలీవుడ్ స‌మాచారం. త్వ‌ర‌లోనే `బీస్ట్`లో సెల్వ‌రాఘ‌వ‌న్ పాత్ర‌పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Also read:`ల‌వ్ స్టోరి`లో రేప్ బాధితురాలిగా సాయిప‌ల్ల‌వి?

మ‌రి.. కంప్యూట‌ర్ హాక‌ర్ పాత్ర‌లో సెల్వ‌రాఘ‌వ‌న్ ఏ స్థాయిలో అల‌రిస్తాడో తెలియాలంటే వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కు వేచిచూడాల్సిందే.