English | Telugu
ఎన్టీఆర్..పవన్ కళ్యాణ్ ను కలిపిన ఫ్యాన్స్
Updated : Jan 5, 2016
టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితులలో ఒకే ఫ్యామిలీలో ఉన్న హీరోలందరిని ఒకే ఫ్లెక్సీలో చూడడం కష్టంగా మారింది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గత కొంతలంగా సపరేట్ గా వుంటున్న విషయం తెలిసిందే. అలాగే నందమూరి ఫ్యామిలీలో బాబాయి, అబ్బాయిల మధ్య పోటీ కూడా తీవ్రమైంది. దీంతో ఆయా కుటుంబలకి చెందిన హీరోల ఫ్యాన్స్ కూడా విడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు కుటుంబాలకి చెందిన హీరోలు ఓకే ఫ్లెక్సీలో కనిపిస్తారని ఎవరైన ఊహిస్తారా? కానీ ఇప్పుడు అదే జరిగింది.తూర్పుగోదావరి జిల్లా ముప్పాడ గ్రామంలో ఇలాంటి చిత్రమైన ఫ్లెక్సీనే దర్శనమిచ్చింది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లను ఒకే ఫ్లెక్సీలోకి ఎక్కించేశారు అభిమానులు. తమ గ్రామస్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ ఫ్లెక్సీ పెట్టారు ఇద్దరు కుర్రాళ్లు. ఈ ఫ్లెక్సీకి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫ్లెక్సీ పెద్ద చర్చనీయాంశమవుతోంది.