English | Telugu
రణవీర్ సింగ్ కి బెదిరింపులు.. చేసింది వాళ్లేనా!
Updated : Feb 11, 2026
-ధురంధర్ పార్ట్ 2 తో మార్చి 19 న వస్తున్న రణవీర్
-ఈ లోపు డబ్బు డిమాండ్ చేస్తు బెదిరింపులు
-బెదిరింపులు వెనక ఉంది ఆ గ్యాంగేనా!
ధురంధర్(Dhurandhar)తో ఇండియన్ సినీ బాక్స్ ఆఫీస్ వద్ద బిఫోర్ ధురంధర్ వరకు ఉన్న రికార్డులన్నింటికీ సవాలు విసిరాడు రణవీర్ సింగ్(Ranveer Singh). తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కూడా. దీంతో మార్చి 19 న విడుదల కాబోతున్న ధురంధర్ పార్ట్ 2 తో తన రికార్డులని తానే క్రాస్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం రిలీజైన టీజర్ ఆ సంకేతాలని చాలా బలంగానే ఇస్తుంది. అభిమానులు, ప్రేక్షకుల్లో కూడా పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి ఈ టైంలో రణవీర్ కి బెదిరింపులు రావడం వారందరిని కలవరపరుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
రణవీర్ సింగ్ కి నిన్న వాట్స్ అప్ వాయిస్ నోట్ వచ్చింది. సదరు నోట్ లో పేరు చెప్పని ఒక వ్యక్తి కోట్ల రూపాయల డబ్బుని డిమాండ్ చేసాడు. ఈ బెదిరింపు విషయాన్నీ పోలీసులు అధికారంగా వెల్లడి చేయడమే కాకుండా బెదిరింపులు వెనక గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ దిశగా తమ ఎంక్వరీని స్టార్ట్ చేసిన పోలీసులు రణవీర్ కి వ్యక్తిగత రక్షణ సిబ్బందిని పెంచడంతో పాటు నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసారు. ధురంధర్ 2 రిలీజ్ కి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ రణవీర్ కి బెదిరింపులు రావడం బాలీవుడ్ లో చర్చినీయాంశ మయ్యింది.
Also read:రెహ్మాన్ కి తెలుగు నుండి భారీ ఆఫర్స్?
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ ని బెదిరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిష్ణోయ్ తీహార్ జైల్లో ఉన్నాడు.