English | Telugu
రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్.. ఈసారి అంతకుమించి..!
Updated : Jun 3, 2025
2023లో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సిరీస్ 'రానా నాయుడు' ఎంతటి ఆదరణను పొందిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘రానా నాయుడు సీజన్2’ మన ముందుకు రానుంది. గతసారి కంటే కఠినమైన, చీకటి పొరలను కలిగిన అంశాలు ఇందులో ఉండబోతున్నాయి. (Rana Naidu Season 2)
సీజన్1 లో సెలబ్రిటీల సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే వ్యక్తిగా రానా మనకు కనిపించాడు. అయితే సీజన్2లో మాత్రం తన కోసం, తన కుటుంబం కోసం పోరాడాల్సి వస్తుంది. సీజన్1 కంటే సీజన్2లో మరింత తీవ్రతరమైన పరిస్థితులు కనిపించనున్నాయి. రానా చిట్టచివరగా ఓ ప్రమాదకరమైన పనిని ఫిక్స్ చేయాలని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను చివరి వరకు చేరుకుంటాడు. అది విజయవంతమైతే అతని కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. అయితే రౌఫ్ రూపంలో అనుకోని తుపాన్ ఎదురవుతుంది. ఇద్దరి మధ్య యుద్దం మొదలవుతుంది. ఈ యుద్ధంలో రానా పైచేయి సాధించాడా లేదా? అనేది సీజన్-2 చూసి తెలుసుకోవాలి.
రానా నాయుడు సీజన్2 జూన్13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆకట్టుకునే యాక్షన్, హై ఓల్టేజీ ఫ్యామిలీ డ్రామా ఉండనుంది. ఈ సిరీస్ ను కరణ్ అన్షుమన్ క్రియేట్ చేసి సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రాలతో కలిసి తెరకెక్కించారు. సుందర్ అరోన్, లోకో మోటివ్ గ్లోబల్ నిర్మాణంలో రూపొందింది. అర్జున్ రాంపాల్, సూర్వీన్ చావ్లా, కృతి ఖర్భందా, సుషాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, మరియు డినో మోరియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.