English | Telugu

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం 

భారతీయ సినీ పరిశ్రమలో ,భారతీయ టెలివిజన్ పరిశ్రమలో, భారతీయ పత్రికారంగంలో, భారతీయ వ్యాపార రంగంలో, పెను విషాదం చోటు చేసుకుంది. కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగుని, స్థిరత్వాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపిన ఆలు పెరగని పోరాటయోధుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు ( Ramoji rao)గారు స్వర్గలస్థులయ్యారు.

కొన్ని రోజుల నుంచి ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.దీంతో కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం హాస్పిటల్ లో జాయిన్ చేసారు. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించే స్థాయికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.చివరకి పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. భౌతిక దేహాన్ని ఫిలిం సిటీ లోని ఆయన స్వగృహానికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనుంది. ఒక మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం భారతదేశంలో ఇదే తొలిసారి. పలువురు సినీ ప్రముఖులు సినీ రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఆయన మృతికి సంతాపాన్ని తెలియచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే పెదపారుపడి ఆయన జన్మస్థలం.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.