English | Telugu

వ‌ర్మ 'బుద్ది గ‌డ్డి తిని...'

అంద‌రినీ వాడుకొని త‌న సినిమాకి ప్ర‌చారం చేసుకొంటుంటాడు వ‌ర్మ‌. అయితే ఇప్పుడు తెలివిగా రాంగోపాల్ వ‌ర్మ‌ని వాడుకోవ‌డం మొద‌లెట్టారు మిగ‌తావాళ్లు. వ‌ర్మ క‌థ ఆధారంగా రెండు మూడు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఇప్పుడు మ‌రోటి జ‌త క‌లిసింది. ఈసారి వ‌ర్మ‌పై ఆయ‌న శిష్యుడు జెడి చ‌క్ర‌వ‌ర్తినే ఓ సినిమా తీయ‌బోతున్నాడ‌ట‌. ఆ సినిమా పేరు కూడా కాస్త వెరైటీగా ఉంది. అదే 'బుద్ది గ‌డ్డితిని..'. దీనికి రాంగోపాల్ వ‌ర్మ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడ‌ని టాక్‌. జెడి న‌టిస్తూ, ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. వ‌ర్మ ఆలోచ‌న‌లు, ఆయ‌న జీవిన విధానం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్ర‌మట‌. అంతేకాదండోయ్‌... రాంగోపాల్ వ‌ర్మ పిచ్చ‌గా ఆరాధించే శ్రీ‌దేవి కూడా న‌టించ‌బోతోంద‌ట‌. జెడీ అంతకు ముందు ద‌ర్శ‌కుడిగా నాలుగైదు ప్ర‌య‌త్నాలు చేశాడు. ఒక్క‌దాంట్లోనూ స‌క్సెస్ కాలేక‌పోయాడు. ఈసారి వ‌ర్మ‌నే న‌మ్ముకొని, ఆయ‌న్నే అస్త్రంగా సంధించి ఈ సినిమా చేయ‌బోతున్నాడు. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో..? ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.