English | Telugu

బ్రూస్ లీ ఆడియో: చరణ్ టెన్షన్ పడ్డాడట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ ఆడియో రిలీజ్ మెగా అభిమానుల మధ్య చాలా గ్రాండ్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి సీడీని వినాయక్ కు అందించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎంతో క్వాలిటీతో సినిమా చేసాం. మొదటిసారిగా 5 నెలల్లో నేను సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాను. ఖర్చుకు వెనుకాడకుండా దానయ్య గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన లేకపోతే సినిమా అనుకున్న టైం కి రిలీజ్ చేసేవాళ్ళం కాదు. కోన, గోపి గారు ఈ సినిమా కోసం పని చేసినందుకు థాంక్స్. బ్రూస్ లీ సాంగ్ షూటింగ్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది. అది రేపే కంప్లీట్ చేయనున్నాం. ఈ సినిమాలో కృతి, నదియ కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. కృతి స్టార్ హీరోయిన్ అయిన నాకు అక్కగా నటించింది. సినిమా కథ అంతా అక్క తమ్ముళ్ళ మధ్య నడుస్తుంటుంది. నాన్నగారితో మొదటిసారి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఆయన ఉన్న 5 నిమిషాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది.. అని చెప్పారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.