English | Telugu
బ్రూస్ లీ ఆడియో: కోన, శ్రీనువైట్ల ఏమ్మన్నారంటే..
Updated : Oct 3, 2015
కోన వెంకట్, శ్రీనువైట్లకు విభేదాలు వచ్చిన తరువాత..మళ్ళీ కలిసి పనిచేసిన సినిమా ఇది. కోన వెంకట్, గోపీ మోహన్‌లతో శ్రీనువైట్ల కలిసి పని చేస్తే ఆ సినిమాహిట్టనే చెప్పవచ్చు. బ్రూస్ లీ సినిమా గురించి వీరు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం:
కోన వెంకట్ మాట్లాడుతూ.. 2003 నుంచి మేము మొదటిసారి గా పని చేసే హీరోల ప్రతి సినిమా పెద్ద సక్సెస్ అయ్యాయి. అలానే రామ్ చరణ్ కు కూడా ఈ సినిమా కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. చిరంజీవి గారు షూటింగ్ లో ఫస్ట్ షాట్ లో నటించి వస్తున్నప్పుడు ఆయనను చూడడానికి సిగ్గుపడ్డాను. నేను రెడీ గా ఉన్నాను మీ సంగతేంటి అన్నట్లుగా అనిపించింది. అందరు ఈ సినిమాను ప్రేమించి జీవం పోస్తే చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చి ఆయుష్షు పోశారు.. అని చెప్పారు.
శ్రీనువైట్ల మాట్లాడుతూ.. చిరంజీవి గారు మొదట నా స్క్రిప్ట్ విని ఓకే చేసారు. చరణ్ ను నాకు ఇవ్వడంతో పాటు చిరంజీవి గారు కూడా ఈ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనను ఫ్యాన్స్ ఎలా ఉండాలని ఆశిస్తారో అదే విధంగా సినిమాలో చిరంజీవి గారు ఉంటారు. గోపి, కోన నాతో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. ఈ సినిమా బాగా రావడానికి కారణమయ్యారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అధ్బుతంగా చేస్తున్నాడు. ఫోటోగ్రఫీ చాలా బావుంటుంది. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు అనుకున్న సమయంలో సినిమాను రిలీజ్ చేయాలని ఎంతో కష్టపడి పని చేసారు. దానయ్య గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.. అని చెప్పారు.