English | Telugu
రామ్‌చరణ్ తాగాడు.. వాగాడు
Updated : Feb 9, 2015
మేలిపండు చూడ, మేలిమై ఉండగా - అన్నట్టు పైకి అందరూ హీరోల్లానే కనిపిస్తారు. కానీ లోతు చూస్తే తెలుస్తుంది అసలు సంగతి. హీరోల్లోనూ ఆకతాయిలు, మందుబాబులు ఉంటారని చాలాసార్లు రుజువైంది. ఇదిగో... ఇది మరో ఉదంతం. రామ్‌చరణ్ తాగి గోల చేసి ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం.25లో తన నివాసంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు చరణ్. ఈ పార్టీలో రాజకీయ నాయకుల తనయులూ ఉన్నారట. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుఝాము వరకూ పార్టీ కొనసాగిందని తెలుస్తోంది. ఎవరి ఇంట్లో వాళ్లు పార్టీ చేసుకొంటే తప్పేంటి?? కాకపోతే తాగి అల్లరి అల్లరి చేశారట. ఈ అరుపులు, కేకలతో స్థానికులకు నిద్రాభంగమైంది. దాంతో ఆ వీధిలోనే ఉంటున్న ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. చరణ్‌నీ, అతని స్నేహితుల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మాట వినలేదని సమాచారమం. దాంతో ఆదివారం సాయింత్రం చరణ్ పై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎంత వరకూ వెళ్తుందనేది ఆసక్తిగా మారింది.