English | Telugu

దుమ్మురేపిన ఎన్టీఆర్ రభస

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రభస ఫస్ట్‌లుక్, ట్రెయిలర్‌కు అప్పుడే చక్కటి రెస్పాన్స్ వచ్చింది. రామయ్యా వస్తావయ్య తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న రభస చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.


రభస ఫస్ట్‌లుక్ చూసిన తర్వాత అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పాలి. ఎనర్జీ ఆండ్ మాస్ లుక్‌తో పాటు ప్యామిలీ వాతావరణం కనిపించేలా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు చిత్రం ఎలా ఉండబోతుందో అనే ఆసక్తిని మరింతగా పెంచేశాయి. ఇక ఈ చిత్రం ఉన్నతమైన సాంకేతిక విలువలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని అంటున్నారు చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్.
బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, అజయ్, నాగినీడు, శ్రవణ్, భరత్, రవిప్రకాష్, ప్రభాకర్, సురేఖావాణి, ప్రగతి, సత్యకృష్ణ, మీనా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇంత మంది తారలతో సాగే ఈ చిత్రం తప్పకుండా ఒక పండగల ఉంటుందని అనుకోవచ్చు.
ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్.కె.నాయుడు, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, శ్రీమణి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ:బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్‌వాస్.

రభస ట్రెయిలర్

;