English | Telugu
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వద్దు
Updated : Jul 11, 2025
సుదీర్ఘ కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటు తనకంటు ఒక బెంచ్ మార్కుని క్రియేట్ చేసుకున్నాడు ఆర్ నారాయణ మూర్తి(R Narayana Murthy). సినిమా అనేది సామాజిక సేవ కూడా అని నమ్మే ఆర్ నారాయణ మూర్తి ఆ దిశగానే ఎన్నో చిత్రాల్లో నటించడమే కాకుండా నిర్మాతగాను, దర్శకుడిగాను ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాడు. ప్రస్తుతం 'యూనివర్సిటీ పేపర్ లీక్'(university paper leak)అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించగా, అగస్ట్ 22 న ఈ మూవీ విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఇటీవల 'తెలంగాణ'(Telangana)రాష్ట్రానికి సంబంధించి 'కాంగ్రెస్' పార్టీ 'ఎంఎల్ సి' గా నియమితులైన 'అద్దంకి దయాకర్'(addanki Dayakar)తో పాటు మరికొంత మంది ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారులకి ఈ చిత్రం యొక్క ప్రివ్యూ ని ప్రదర్శించడం జరిగింది. అనంతరం నారాయణ మూర్తి మాట్లాడుతు మూవీ చూసిన ప్రతి ఒక్కరికి నా అభినందలు. కార్పొరేట్ విద్య మాఫియాని అరికట్టి ప్రభుత్వ విద్యని ప్రోత్సహించాలనే ఉదేశ్యంతోనే 'యూనివర్సిటీ పేపర్ లీక్' చిత్రాన్ని తెరకెక్కించాను. ప్రభుత్వంతో మాట్లాడి టాక్స్ లేకుండా చేస్తామని అద్దంకి దయాకర్ . అందెశ్రీ(Ande sri)గారు అన్నారు. వాళ్ళిద్దరికీ నా ధన్యవాదాలు. నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వద్దు. దయచేసి నా సినిమాని ప్రమోట్ చేసి పదిమందికి తెలిసేలా చెయ్యండి. ప్రజలకి నా సినిమా కనెక్ట్ అయితే ప్రజలకే మంచి జరుగుతుందని నారాయణమూర్తి చెప్పాడు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతు 'యూనివర్సిటీ పేపర్ లీక్' మూవీని అందరు చూడాలని, చాలా మంచి చిత్రంతో పాటు ఎంతో మందిని ఆలోచింపచేస్తుందని చెప్పుకొచ్చాడు. అనంతరం నారాయణమూర్తి ని అభినందించడం జరిగింది.