English | Telugu

పూరి కొడుకు 'ఆంధ్రాపోరి' గొడవేంటి?

ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా జంటగా నటిస్తున్న ఆంధ్రాపోరి చిత్రం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కొద్ది రోజుల నుంచి ఖమ్మం జిల్లా పాల్వంచలో జరుగుతోంది. ఈ సంధర్బంగా సినిమా యూనిట్ మెంబర్లు అందరూ భద్రాచలం రోడ్‌లోని ఒక హోటల్లో బస చేశారు. అయితే ఒకరోజు అర్ధరాత్రివేళ పాల్వంచ ఎస్.ఐ. షణ్ముఖాచారి ఈ హోటల్‌కి వచ్చాడు. అక్కడ బస చేసిన సినిమా యూనిట్ సభ్యులతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. పూరి జగన్నాథ్ కొడుకుతో కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ఖమ్మం జిల్లాకు వెళ్ళి అక్కడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. దాంతో పోలీసు అధికారులు సదరు ఎస్.ఐ.ని జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. దాంతో ఇప్పుడు ఆ ఎస్.ఐ. షణ్ముఖాచారి లబోదిబో అంటున్నాడు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.