English | Telugu
డ్రామా నాది కాదు..వాళ్లదే-పూరి
Updated : Apr 19, 2016
డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై దాడి వ్యవహారం చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. నిన్న మీడియా ముందుకు వచ్చిన ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తాము అసలు దాడి చేయలేదని..చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే పూరి ఆఫీసులో తాము అడుగుపెట్టలేదన్నారు. కనీసం సీసీకెమెరా ఫుటేజీ అయినా చూపించాలన్నారు. దీనిపై నిన్న సాయంత్రం మాట్లాడిన పూరి ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్‌మెయిల్ చేసి తప్పుడు లెక్కలు చూపారని వివరణ ఇచ్చారు.
లోఫర్ సినిమా విడుదలకు ముందే అభిషేక్, సుధీర్‌లు తనను కలిశారని వారి బ్యానర్లో ఐదు సినిమాలు చేసేలా అగ్రిమెంట్ చేసుకుందామన్నారు. అయితే తనతో సినిమా ఒప్పందాల పేరుతో వాళ్లకున్న అప్పుల్ని సైతం తనపై రుద్దే ప్రయత్నం చేశారని పూరి వెల్లడించారు. లోఫర్ సినిమా నైజాం హక్కుల్ని 7.5 కోట్లకు కొన్నామని సుధీర్ చెప్పాడని..కానీ నైజాం హక్కులు 3.4 కోట్లకే అమ్మినట్లు నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారని వెల్లడించారు. వీటన్నింటిని చూస్తే ఎవరు ఎంత డ్రామా ఆడారో అర్థమవుతోందన్నారు.