English | Telugu
పృథ్వీకి ‘భలే మంచి రోజు’లు..!!
Updated : Dec 26, 2015
‘భలే మంచి రోజు’ సినిమాలో పృథ్వీ క్యారెక్టర్ మాత్రం భలే పేలింది. అసలీ సినిమాలో పృథ్వీ ఉన్న సంగతే చాలామందికి తెలియదు. అందుకే అతడి ఎంట్రీతో సర్ ప్రైజ్ అయ్యారు ప్రేక్షకులు. ముందు మామూలుగానే మొదలైన ఈ పాత్ర క్లైమాక్స్ లో చెలరేగిపోయింది. పోలీస్ క్యారెక్టర్లు వేసిన హీరోల్ని అనుకరిస్తూ పృథ్వీ చెప్పిన డైలాగులు ఓ రేంజిలో పేలాయి. ముఖ్యంగా సాయికుమార్ ముందు అతణ్నే ఇమిటేట్ చేసే సీన్ సినిమాకే హైలైట్గా నిలిచింది. మొత్తానికి ఏ అంచనాలు లేని పృథ్వీ క్యారెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్టయింది.