English | Telugu
సంక్రాంతికి వస్తున్నాం…కొడుతున్నాం: నాగార్జున
Updated : Dec 26, 2015
కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా.రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నాయికలు. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. నాగార్జున, పి.రామ్మోహన్ నిర్మాతలు. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు శుక్రవారం శిల్పకళావేదికలో పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఇందులో నాగార్జున పంచెకట్టు చూస్తే ‘దసరాబుల్లోడు’ చిత్రంలో ఏఎన్నార్ గుర్తొచ్చారు. ట్రైలర్ చాలా బావుంది. కచ్చితంగా ‘దసరాబుల్లోడు’ తరహాలో సక్సెస్ అవుతుంది’’ అని అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ ‘‘అభిమానుల్ని కలిసి రెండేళ్లయింది. ‘మనం’తో పెద్ద హిట్ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత దానిని మించిన సినిమా చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో రామ్మోహన్ ఈ కథ చెప్పాడు. కల్యాణ్ కృష్ణ చక్కగా తీర్చిదిద్డాడు. నాన్నగారు అనురాగం, అత్మీయత, అనుబంధాలు, పల్లెటూరి వాతావరణం ఇలాంటి సినిమాలనే చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి సినిమాకు హలోబ్రదర్ లాంటి ఎంటర్‌ట్‌న్‌మెంట్‌ను యాడ్ చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచనతో ఈ సినిమా చేశాం. తెలుగువారికి ఇష్టమైన పండుగ సంక్రాంతి. పచ్చదనం, తియ్యదనం అన్నీ కలిసి ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో కూడా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. అనూప్ ఎప్పటిలానే వినసొంపైన పాటలు సమకూర్చారు. సంక్రాంతికి వస్తున్నాం…కొడుతున్నాం’’ అని అన్నారు.