English | Telugu
మహేష్ బాబు బావకు హిట్ వచ్చింది
Updated : Dec 26, 2015
మహేష్ బాబు బావ సుధీర్ బాబు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దక్కింది ఏకైక హిట్టు 'ప్రేమకథా చిత్రమ్' . ఆ హిట్ క్రెడిట్ కూడా అతడికేమీ దక్కలేదు. లేటెస్ట్ గా వచ్చిన 'భలే మంచి రోజు' సుధీర్ కెరీర్‌ను మలుపు తిప్పేట్లే ఉంది. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ కు మంచి పేరు వచ్చింది. బాడీ లాంగ్వేజ్, నటన పరంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ డే కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ కూడా పెద్దగా లేకపోవడంతో సుధీర్‌కు పెద్ద హిట్ దక్కే అవకాశాలు మెండుగా వున్నాయి. సో సుధీర్ బాబు ఎదురుచూస్తున్న 'భలే మంచి రోజు' వచ్చేసింది అనమాట.