English | Telugu

ప‌వ‌న్ కోసం `క్యూ` ఎక్కువైంది!

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆఫీసు ముందు రేష‌న్ క్యూలా.. ద‌ర్శ‌కుల‌, నిర్మాత‌ల క్యూ రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. గ‌బ్బ‌ర్ సింగ్ 2 చేస్తాన‌ని సంప‌త్ నందికి హ్యాండిచ్చాడు ప‌వ‌న్‌. గ‌బ్బ‌ర్ సింగ్ 2 కోసం రెండేళ్లు టైం వేస్ట్ చేసుకొని.. ఇప్పుడు ప్ర‌శ్చాత్త‌ప ప‌డుతున్నాడు సంప‌త్ నంది. దాంతో... ప‌వ‌న్ సంప‌త్‌తో మ‌ళ్లీ ఓ సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు. బెంగాల్ టైగ‌ర్ అయిపోయాక‌.. సంప‌త్ మ‌ళ్లీ ప‌వ‌న్ కోసం వ‌చ్చేస్తాడు. గోపాల గోపాల జ‌రుగుతున్న‌ప్పుడే ద‌ర్శ‌కుడు డాలీకి కూడా ప్రామిస్ చేశాడు. `డాలీతో మ‌రో సినిమా చేస్తా.` అని ఆడియో ఫంక్షన్లోనూ చెప్పాడు. ఆ త‌ర‌వాత ఆ ఊసే ఎత్త‌లేదు. పీవీపీ బ్యాన‌ర్‌లో ప‌వ‌న్ ఓ సినిమా చేయాలి. ప‌వ‌న్ కోసం ప్ర‌సాద్ పొట్లూరి క‌థ‌లు విన‌డం మొద‌లెట్టేశారు. క‌థ ఓకే అయితే మ‌రి ప‌వ‌న్ ఏమంటాడో..?? ప‌వ‌న్‌తో ఓ సినిమా చేయాల‌ని దిల్‌రాజు ఎప్ప‌టి నుంచో ప్లానింగ్‌. ప‌వ‌న్ కోసం కొన్ని క‌థ‌లూ రెడీ చేసుకొన్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా దిల్ రాజుకి ఓ సినిమా చేసిపెడ‌తాన‌ని చెప్పాడు. ఆ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ అత్తాప‌త్తా లేదు. మిత్రుడు త్రివిక్ర‌మ్‌తో ముచ్చ‌ట‌గా మూడో సినిమా గురించి ఎప్ప‌టి నుంచో ప్లానింగ్‌. బ‌న్నీ సినిమా పూర్త‌య్యాక త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ సినిమాపైనే ఫోక‌స్ పెడ‌తార‌ని చెప్పుకొంటున్నారు. ఇప్పుడు దాస‌రి కూడా రెడీ అయిపోయారు. త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌తో ఓ సినిమా చేయబోతున్నా అని అధికారికంగా ప్ర‌క‌టించారు ఆయ‌న‌. చూస్తుంటే ఈ క్యూ ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. మ‌రో వైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌తీ ప‌నీ నిదానంగా చేసే టైపు. ఒకొక్క సినిమాకీ యేడాదైనా టైమ్ తీసుకొంటాడు. గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఈ యేడాది పూర్త‌యితే అదే ప‌ది వేలు. మ‌రి ఈ సినిమాల‌న్నీ ఎప్పుడు మొద‌ల‌వుతాయో.. ఎప్పుడు పూర్త‌వుతాయో.. ఆ బ్ర‌హ్మాదేవుడికే ఎరుక‌.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.