English | Telugu

హ‌న్సిక క‌త్తియుద్ధ క‌ష్టాలు!

క‌థానాయిక‌లు ఎప్పుడూ గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే క‌నిపిస్తారా??? ఇదే ప్ర‌శ్న హ‌న్సిక‌కూ చాలాసార్లు ఎదురైంది. ''నా ప్ర‌తిభ నిరూపించుకొనే అవ‌కాశం రానివ్వండి.. అప్పుడు నేనేంటో చూపిస్తా..'' అని బ‌దులిచ్చింది కూడా. ఆ ఛాన్స్ ఇప్పుడొచ్చింది హ‌న్సిక‌కు. విజ‌య్‌తో క‌ల‌సి పులి అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తోంది హ‌న్సిక‌. అందుకోసం క‌ర్ర‌సాము, క‌త్తిసాము నేర్చుకొంటోంద‌ట‌. ఈ త‌ర్ఫీదులో భాగంగా దెబ్బ‌లు కూడా త‌గులుతున్నాయ‌ట‌. అన్నింటినీ ఓర్చుకొని.. శిక్ష‌ణ తీసుకొంటోంది హ‌న్సిక‌. ''అమ్మో.. ఏంటో అనుకొన్నాగానీ క‌త్తి తిప్ప‌డం చాలా క‌ష్టం. చాలా దెబ్బ‌లు త‌గిలేస్తున్నాయి. ఓర్చుకొంటూ.. నేర్చుకొంటున్నా. హోం వ‌ర్క్ చేసి.. సెట్లో అడుగుపెడితే ఆ ధైర్య‌మే వేరు. తెర‌పై నా క‌ష్టం క‌నిపిస్తుంది. ఈ పాత్ర‌తో నాకు మంచి పేరొస్తుంది.. అది చాలు.. ఈ దెబ్బ‌ల‌న్నీ మ‌ర్చిపోతా'' అంటోంది హ‌న్సిక‌.