English | Telugu

వార్-2 లో ఎన్టీఆర్ కనిపించేది 45 నిమిషాలే.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నారు. జూలై 31న విడుదల కానున్న 'కింగ్ డమ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వార్-2' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నాగవంశీ.

"ఇండియాలోని ఇద్దరు ఫైనెస్ట్ యాక్టర్స్ స్క్రీన్ మీద నువ్వా నేనా అన్నట్టుగా తలపడనున్నారు. అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలతోనే నేను వార్-2 రైట్స్ తీసుకున్నాను. ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ ఉంటుందని, 45 నిమిషాలే కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. ఇద్దరు హీరోల పాత్రలు సమానంగా ఉంటాయి. ఎన్టీఆర్ రోల్ అదిరిపోతుంది, ఇక ఇంట్రడక్షన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది." అని నాగవంశీ చెప్పుకొచ్చారు.

అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ భారీ మైథలాజికల్ ఫిల్మ్ పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి కూడా నాగవంశీ స్పందించారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, 2026 ద్వితీయార్థంలో సినిమా మొదలవుతుందని అన్నారు. రామాయణ అనౌన్స్ మెంట్ ను మించేలా భారీస్థాయిలో అధికారికంగా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నట్లు నాగవంశీ తెలిపారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.