English | Telugu

తెలంగాణ సీఎం అభ్యర్థి సినిమా

సినిమాలకి రాజకీయాలకి విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు సినిమా పుట్టినప్పటినుంచి
చాలా మంది రాజకీయ నాయకుల బయోపిక్ లు వచ్చాయి. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ కి సంబంధించిన ఒక నాయకుడి బయోపిక్ తో ఒక సినిమా రాబోతుంది. తెలంగాణాలో వచ్చేనెల నవంబర్ చివరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ టైం లో తెరకెక్కుతున్న తెలంగాణ నాయకుడి బయోపిక్ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ తెలంగాణాలో కాకలు పుట్టిస్తుంది.

నంద కిషోర్ ,రోజా హీరో హీరోయిన్లు గా దుర్గా నాయుడు దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ప్రవీణ్ ఐ.పి.ఎస్. ఈ చిత్రం ప్రస్తుత బహుజన సమాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. తాజాగా ఆ మూవీ కి సంబంధించిన టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. బహుజనులు బానిసలు కాదని వాళ్లకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చే ఒక వ్యక్తి రాబోతున్నాడని సాగిన టీజర్ లో ప్రవీణ్ కుమార్ ని ఫుల్ గా ఎలివేట్ చేసారు. సినిమా కూడా సరిగ్గా ఎన్నికలకి కొన్ని రోజుల ముందే విడుదల కాబోతుంది.

ఐపిఎస్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయిన ప్రవీణ్ కుమార్ తెలంగాణాలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్ వాది పార్టీ లో చేరారు. మరి ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్న వేళ ప్రవీణ్ ఐ.పి ఎస్ సినిమా ఎలాంటి సంచలనాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాకి నీల మామిడాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.