English | Telugu

నా కొడుకు తక్కువోడేమి కాదంటున్న సీనియర్ నటి 

1970 ,80 వదశకాల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోయిన్లలో ఒకరు జయచిత్ర. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలని పోషించిన ఆమె తెలుగు తమిళ ,మలయాళ కన్నడ భాషల్లో కలిపి సుమారు 200 చిత్రాలకి పైగా నటించింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో వెంకటేష్ తో అబ్బాయిగారు,బాలకృష్ణ తో సమరసింహా రెడ్డి లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇప్పుడు తన థర్డ్ ఇన్నింగ్స్ లో కూడా బాలయ్య తల్లిగా భగవంత్ కేసరి మూవీ లో సూపర్ గా నటించి తన నటనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించింది. తాజాగా తన కొడుకు గురించి గొప్పగా చెప్తుంది. ఇంతకీ జయచిత్ర ఏం చెప్తుంది? అసలు ఆమె కొడుకు ఎవరు?

రీసెంట్ గా కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన రూల్స్ రంజన్ మూవీ కి అమ్రేష్ అనే యువకుడు సంగీత దర్శకత్వం వహించాడు. ఈ అమ్రేష్ ఎవరో కాదు స్వయానా జయచిత్ర కొడుకు. ఈ విషయం జయచిత్ర చెప్పేవరకు చాలా మందికి తెలియదు. అలాగే ఆ మూవీలోని సమ్మోహనుడా అనే పాట చాలా పాపులర్ అయ్యింది. కానీ అమ్రేష్ పేరు మాత్రం అంతగా ఫోకస్ అవ్వలేదు.
ఆ విషయాలన్నీ అటుంచితే ఇప్పుడు జయచిత్ర తన కొడుకు గురించి, అలాగే తన కొడుకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలుగు ప్రేక్షకులతో పంచుకుంది. అమ్రేష్ కి ప్రస్తుతం తెలుగులో నాలుగు కొత్త సినిమా ప్రాజెక్ట్ లు ఉన్నాయని త్వరలోనే ఆ సినిమాల వివరాలు తన కొడుకు చెప్తాడని అలాగే తన కొడుకు తమిళంలో కూడా ఎన్నో మంచి సినిమాలకి సంగీత దర్శకత్వం వహించాడని ఇక నుంచి తెలుగుకే తన కొడుకు ప్రాధాన్యత ఇస్తాడని చెప్తుంది.
అమ్రేష్ గతంలో ఒక తమిళ సినిమాలో హీరో గా నటించాడు. అంతే కాకుండా ఆ సినిమాకి అతనే మ్యూజిక్ ని కూడా అందించాడు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా పరాజయం పాలయ్యింది. దాంతో ఇక మ్యూజిక్ డైరెక్టర్ గానే అమ్రేష్ సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే జయచిత్ర మీడియాతో చెప్పే వరకు మ్యూజిక్ డైరెక్టర్ అమ్రేష్ ఆమె కొడుకనే విషయం ఎవరకి తెలియదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.