English | Telugu

నితిన్ తమ్ముడు మూవీతో లయ రిఎంట్రీ!


అలీతో సరదాగా ఈవారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లయ వచ్చింది. ఆలీ, లయ కలిసి స్వయంవరం మూవీలోని సాంగ్ కి స్టెప్స్ కూడా వేశారు. ఈ సాంగ్ తర్వాత ‘‘ఇప్పుడు వచ్చిన ఈ పాటలు మీ అమ్మవి. లయగారు వచ్చారా ?’’ అని లయనే అడుగుతూ కాసేపు ఫన్ చేసాడు ఆలీ. దానికి నవ్వుతూ ‘‘నేనే లయ’’ అని సమాధానమిచ్చింది. అది విన్న ఆలీ షాకయ్యాడు. ‘‘నేను శ్లోక అనుకున్నారా’’ అని నవ్వేసింది లయ. ‘స్వయంవరం’ మూవీ వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లయకు కంగ్రాట్స్ చెప్పాడు ఆలీ. లయ కూడా తిరిగి ఆలీకి కంగ్రాట్స్ చెప్పారు.

లయ పర్సనల్ లైఫ్ గురించి అడిగారు. ‘‘లయ చాలా ఇబ్బందుల్లో ఉంది. అమెరికాలో రోడ్లపై ఉంటోంది అనే కామెంట్స్ విన్నప్పుడు ఎలా అనిపించింది’’ అని ఆడిగాడు ఆలీ. ‘‘ఎందుకు ఇదంతా. ఇలాంటివి వినేటప్పుడు చాలా బాధేస్తుంది. అడుక్కు తింటున్నాను అనే కాదు ఇంకా చాలా చేస్తున్నానని కూడా అన్నారు. అవన్నీ తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంది’’ అని పాపం ఫీలయ్యింది లయ. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ "2005లో మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఆంటీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అని నన్ను అడిగారు. ఇప్పుడు కాదు అని చెప్పడంతో మా ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదనుకున్నారు’’ అంటూ తమ పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇండియాకు రావడానికి కారణమేంటి అని అడిగాడు ఆలీ ‘‘నేను నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాను’’ అని అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత తను, ఆలీ కలిసి నటించిన సినిమాలను గుర్తుచేసుకున్నారు. ఇలా లయ ఎన్నో విషయాలు చెప్పారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .