English | Telugu
2023 ... తెలుగు సినిమాలకు దూరంగా రష్మిక
Updated : Jan 2, 2023
ఇటు దక్షిణాది.. అటు ఉత్తరాది ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్స్‌లో రష్మిక మందన్న ఒకరు. అయితే 2023లోమాత్రం తెలుగు సినిమాలకు ఈ అమ్మడు దూరంగా ఉండబోతుంది. అదేంటి.. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తుంది కదా.. తెలుగు మూవీస్‌కు రష్మిక దూరం కావటం ఏంటనే సందేహం రాక మానదు మనకు. అసలు విషయం ఏంటంటే.. జాగ్రత్తగా పరిశీలిస్తే రష్మిక మందన్న లిస్టులో రాబోతున్న సినిమాలేవీ తెలుగు సినిమాలు కావు. ఓసారి పరిశీలిస్తే సంక్రాంతికి రాబోతున్న వారసుడు (తమిళంలో వారిసు) చిత్రం తమిళ సినిమానే. అదేంటి వారసుడు తెలుగు, తమిళంలో రూపొందింది కదా అని అనుకోకండి. ఎందుకంటే నిర్మాత దిల్ రాజునే వారసుడు సినిమాను తమిళ మూవీగా చెప్పుకుంటున్నారు.
వారసుడు తర్వాత రష్మిక నటించిన మరో చిత్రం మిషన్ మజ్ను బాలీవుడ్ మూవీ. సిద్ధార్థ్ మల్హోత్రాతో రష్మిక నటించిన చిత్రం. ఇదైతే థియేటర్స్‌లో విడుదలే కావటం లేదు. జనవరి 20న డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ అవుతుంది. ఓటీటీ రిలీజ్ .. రష్మిక సౌత్ అమ్మాయి కాబట్టి సౌత్ లాంగ్వేజెస్‌లో సినిమా ఉండొచ్చు. కానీ మిషన్ మజ్ను తెలుగు సినిమా కాదు. ఇక రష్మిక నటించిన మరో చిత్రం యానిమల్. దీనికి దర్శకుడు సందీప్ వంగానే అయినప్పటికీ హీరో రణ్‌భీర్ కపూర్.. నిర్మాత టి సిరీస్ కావటంతో సినిమాను బాలీవుడ్ ప్రాజెక్ట్‌గానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో.. ఈ ఏడాది రష్మిక డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ లేదలే చెప్పాలి. అమ్మడు చెస్తున్న పుష్ప 2 ది రూల్ తెలుగు సినిమా. పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ కాకపోతే మాత్రం 2023 రష్మికకు తెలుగు సినిమా లేదనే చెప్పాలి.. అంతే కదా మరి.