English | Telugu
గోపీచంద్‌కి ప్రభాస్ కాంప్లిమెంట్స్
Updated : Jun 12, 2014
జూన్ 12 తెలుగు హ్యాండ్‌సమ్ హీరో గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్న చిత్ర యూనిట్ ఆ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో గోపిచంద్ ని చూడగాని మిర్చీలో ప్రభాస్ గుర్తొస్తున్నాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్మొదలయ్యాయి. మరో వైపు గోపిచంద్ కొత్త లుక్ బాగుందని అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎలా వున్నా నా ఫ్రెండ్ ఈ కొత్తలుక్ లో అదిరిపోయాడని ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా కితాబివ్వటం, గోపీచంద్ కు నిజమైన బర్త్‌డే గిప్ట్ అని అనుకోవచ్చు.
మిర్చీ నిర్మాతలు వంశీ కృష్ణా, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్‌పై గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ సినిమాను నూతన దర్శకులు రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే జరిగిన ఈ చిత్ర ప్రారంబోత్సవానికి ప్రభాస్ తో సహా పలువురు సినీ ప్రముఖులు వచ్చిన సంగతి తెలిసిందే. యాక్షన్ , కామెడీ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ 6 నుంచి మొదలైంది. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. పుట్టిన రోజున రెండు రెండు గిప్ట్‌లు అందుకున్న గోపిచంద్, ఈ ఏడాది మంచి హిట్స్ సాధించాలని కోరుకుందాం.