English | Telugu

దాసరితో పవన్ కళ్యాణ్ సినిమా?

టాలీవుడ్ లో ఓ సంచలనకర కాంబినేషన్ తెరపైకి రాబోతుంది. దాసరి సొంత బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం రూపొందబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా దాసరినారాయణరావు గారు ప్రకటించారు. అయితే విషయం సినీ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి, దర్శక ప్రముఖుడు దాసరికి మధ్య సంబందాలు గత కొంతకాలంగా ఎలా వున్నాయో, అందరికీ తెలిసిందే. ఈ సమయంలో ఈ కాంబినేషన్ చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇండస్ట్రీలో సినిమా వేరు,వ్యక్తిగత సంబంధాలు వేరని చెప్పవచ్చు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్, దాసరిల కాంబినేషన్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.