English | Telugu
మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్!
Updated : Apr 16, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో 'వినోదయ సిత్తం' రీమేక్, 'హరి హర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' వంటి సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.
త్రివిక్రమ్ కథతో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు 'రావణాసుర' మూవీ ప్రమోషన్స్ సమయంలో సుధీర్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, 2024 ఎన్నికల తర్వాతే సుధీర్ ప్రాజెక్ట్ కి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ పవన్ మాత్రం ఈ ఏడాదే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఐదారు నెలల్లో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి, ఆ వెంటనే ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెడతారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ-మాటలు అందిస్తుండటం విశేషం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో సెప్టెంబర్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.