English | Telugu

అంజలిని భయపెడుతున్న సైతాన్


అసలే సీతమ్మ.. అందులోనూ అందాల అంజలి పాప... ఆమెను భయపెట్టడానికి ఓ సైతాన్ సిద్ధమవుతున్నాడు.
అంజలి తాజాగా నటిస్తున్న చిత్రం ‘గీతాంజలి’. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పుడు ఒక సైతాన్ రాజు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ సైతాన్ నవ్విస్తూ భయపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


కామెడీ కింగ్ కిల్ విల్ పాండే సైతాన్ రాజాగా కొత్త అవతారం ఎత్తుతున్నాడు. టాప్ హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న బ్రహ్మీ ఇప్పుడు స్క్రీన్ మీద కనపడితే చాలు అనుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. అందుకే ఈ హర్రర్ కామెడీలో ఆయనకో ప్రత్యేక పాత్ర క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. గీతాంజలి చిత్రానికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం‌వి‌వి సత్యనారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోన వెంకట్ కథ అందిచారు. పోస్టర్లో కనిపిస్తున్న సైతాన్ రాజాగా గెటప్ ఆ క్యారెక్టర్ ఎంత వెరైటీగా వుండబోతోందో తెలియచేస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.