English | Telugu

ఓజీ బర్త్ డే గ్లింప్స్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన సుజీత్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'ఓజీ' నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. (Pawan Kalyan)

“HBD OG - LOVE OMI” పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో 'ఓజాస్‌ గంభీర' అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనుండగా.. 'ఓమి భావు' అనే ప్రతినాయక పాత్రలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓజీకి ఓమి బర్త్ డే విషెస్ తెలిపినట్లుగా ఈ గ్లింప్స్ ను రూపొందించారు. "డియర్ ఓజీ. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుచూస్తున్న నీ ఓమి. హ్యాపీ బర్త్ డే ఓజీ" అంటూ ఓమి కోణంలో ఈ గ్లింప్స్ సాగింది. పవన్ ని ఢీ కొట్టే పవర్ ఫుల్ రోల్ లో ఇమ్రాన్ హష్మీ కనిపిస్తున్నాడు. ఇక గ్లింప్స్ చివరిలో మారణహోమం సృష్టించి.. ఒంటి మీద నెత్తుటి మరకలతో, చేతిలో కత్తి పట్టుకొని ఉన్న పవన్ కళ్యాణ్ షాట్ అదిరిపోయింది. (They Call Him OG)

'ఓజీ' నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకున్నప్పటికీ.. పవన్ ఫ్యాన్స్ లో మాత్రం కాస్త నిరాశ కనిపిస్తోంది. ఎందుకంటే, పవన్ బర్త్ డే గ్లింప్స్ కాబట్టి.. ఎక్కువగా ఆయన్నే చూపిస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ, ఇమ్రాన్ హష్మీ కోణంలో గ్లింప్స్ ని రూపొందించడంతో.. పవన్ ని ఎక్కువసేపు చూసే అవకాశం రాలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన అవసరంలేదని, ట్రైలర్ కోసం సుజీత్ అద్భుతమైన కంటెంట్ దాచాడని.. ఆ ట్రైలర్ తో అందరూ సంతృప్తి చెందుతారని ఇన్సైడ్ టాక్.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.