English | Telugu
తెలుగు హీరోపై అత్యాచారం కేసు
Updated : Sep 4, 2024
అక్కినేని నాగచైతన్య(naga chaitanya)హీరోగా వచ్చిన ప్రేమమ్(premam)ఎంత పెద్ద విజయం సాధించిందో అందరకి తెలిసిందే. పైగా ఎంత పెద్ద విజయం అంటే ప్రేమమ్ మలయాళ మాతృక ని కూడా చూసేంత .అందులో హీరోగా చేసింది నివిన్ పౌలి(nivin pauly)ఇప్పుడు ఈ హీరోకి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ చిత్ర సీమలో భారీ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణల మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కోవలోనే నివిన్ పౌలి మీద కూడా కేసు నమోదయ్యింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని తనను దుబాయ్ తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని ఒక నటి ఫిర్యాదు చేసింది.దీనిపై విచారణ జరిపిన పోలీసులు నటి చెప్పేది నిజమని తేల్చి నివిన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసారు. అలాగే ఈ కేసుకి సంబంధించే మరో ఆరుగురిపై కూడా నాన్ బెయిలబుల్ ఆర్డర్స్ జారీ అయ్యాయి.
నిర్మాతగాను నివిన్ కొన్ని చిత్రాలని నిర్మించడంతో పాటుగా ముతాన్, లవ్ ఇన్ లండన్ అనే తెలుగు సినిమాల్లోను చేసాడు.ఇక హేమ కమిటీ ఇచ్చిన నివేదికకి బాధ్యత వహిస్తూ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ తో పాటు యావత్తు కార్యవర్గం కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.