English | Telugu
నిత్యా మీనన్ పెళ్ళి... సెక్యూరిటీ అవసరం లేదట!
Updated : Oct 30, 2023
పెళ్ళి విషయంలో అమ్మాయిలకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది. అందులోనూ సినిమా తారలకు రిక్వైర్‌మెంట్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గ అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు కోరుకున్న వారు దొరక్కపోవడం వల్ల, మరి కొన్ని కారణాల వల్ల సినిమా హీరోయిన్లు పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఆ లిస్ట్‌లో నిత్యా మీనన్ కూడా చేరుతుందా? అని కొన్నాళ్ళ వరకు అందరూ అనుకున్నారు. ఎందుకంటే పెళ్ళి గురించి ఆ తరహా కామెంట్స్ గతంలో చేసింది నిత్య. అందుకే అందరూ అలా ఫిక్స్ అయ్యారు.
అయితే తాజాగా పెళ్ళి గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ‘నేను ఒక ట్రెడిషనల్ అమ్మాయిని, మన సంస్కృతి అంటే నాకు చాలా గౌరవం. పెళ్ళి విషయంలో నాకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. ప్రస్తుతం నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అంతకుమించి ఎవరైనా ఆలోచించేవారు దొరికితే తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను’ అంటూ క్లారిటీ ఇచ్చింది నిత్యా మీనన్.
నిత్యా మీనన్ సినిమాల్లోనే కాదు, వెబ్ సిరీస్‌లలో, టీవీ షోల్లోనూ తన ప్రతిభ చాటుకుంటోంది. ‘బ్రీత్.. ఇన్ టు ద షాడోస్’, ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ వెబ్ సిరీస్‌లలో నటించిన నిత్యా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఆకట్టుకుంటోంది. తెలుగులో ఇండియన ఐడల్ షోకి హోస్ట్‌గా వ్యవహరించింది. ‘స్కైలాబ్’ చిత్రంతో నిర్మాతగా మారిన నిత్యా ప్రస్తుతం ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ చేస్తోంది. అంతర్జాతీయంగా వెబ్ వీక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఇండియన ఐడల్ షోకి హోస్ట్‌గానూ వ్యవహరించింది. అలాగే మలయాళ వెబ్ సిరీస్ ‘మాస్టర్ పీస్’లో కూడా నటించింది.