English | Telugu

సిద్ధార్థ్‌, అదితి రావు రిలేషన్‌కి అజయ్‌ భూపతే కారణమా?

సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి రిలేషన్‌ ఉన్న విషయం తెలిసిందే. అడపా దడపా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. తమ మధ్య ఏదో వుంది అని చెప్పేందుకు వీరిద్దరూ తెగ తంటాలు పడుతున్నారు. అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘మహా సముద్రం’ సెట్స్‌లోనే వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో వెంటనే రిలేషన్‌లోకి వెళ్ళిపోయారట. వీరిద్దరి రిలేషన్‌పై అజయ్‌ భూపతి చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సిద్ధార్థ్‌, అదితి కలిసి తీసుకున్న సెల్ఫీని పోస్ట్‌ చేస్తూ అజయ్‌ భూపతి తన ట్వీట్‌లో ఏమన్నాడంటే.. ‘దీనికి నేనే కారణం నేనే అని అందరూ అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది?’ అంటూ ప్రశ్నించాడు. వీరిద్దరితోనూ సినిమా చేసిన డైరెక్టరే ఈ ప్రశ్న అడగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే షూటింగ్‌ జరుగుతున్నంత కాలం అతని ఎదురుగానే వారు ఉంటారు. ఈ విషయం తెలియకుండా ఉంటుందా అనేది నెటిజన్ల ప్రశ్న. అజయ్‌ ఈ ప్రశ్న వేయడం వెనుక సిద్ధార్థ్‌, అదితి మధ్య విషయం ఉందని ఇప్పుడు అందరూ ఫిక్స్‌ అయ్యారు. 2021లో వచ్చిన ‘మహాసముద్రం’ డిజాస్టర్‌ అయిన విషయం తెలిసిందే. అయితే సిద్ధార్థ్‌, అదితికి ఇది సూపర్‌హిట్‌ మూవీనే. ఎందుకంటే వీరి రిలేషన్‌కి పునాది వేసింది ఆ సినిమానే కాబట్టి వారికది మెమరబుల్‌ మూవీ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.