English | Telugu

ఎన్టీఆర్ అవార్డుపై బాలకృష్ణ రియాక్షన్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు వివిధ విభాగాల్లో ఇటీవల అవార్డులు ప్రకటించారు. అలాగే 2014 నుంచి 2023 సంవత్సరం వరకు విడుదలైన సినిమాలకు సంబంధించి ఉత్తమ చిత్రాల అవార్డులను తాజాగా అనౌన్స్ చేశారు. వీటితో పాటు, స్పెషల్‌ జ్యూరీ అవార్డులను కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణకు 'ఎన్టీఆర్ జాతీయ అవార్డు'ను ప్రకటించడం విశేషం.

తన తండ్రి ఎన్టీఆర్ పేరు మీదున్న 'ఎన్టీఆర్ జాతీయ అవార్డు' ప్రకటించడంపై బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. "ఎన్టీఆర్ శ‌తజ‌యంతి ఉత్స‌వాలు పూర్తిచేసుకున్న అద్భుత‌మైన ఘ‌డియ‌లు ఒక వైపు. ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు. నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్ తో సత్కరించిన ఇలాంటి త‌రుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి 'ఎన్టీఆర్ జాతీయ అవార్డు'ని నాకు ప్ర‌క‌టించ‌డం నా అదృష్టంగా, దైవ నిర్ణ‌యంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారానికి న‌న్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్ర‌భుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ స‌భ్యుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను. ప్ర‌పంచం న‌లుమూల‌లా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల దీవెన‌లు, నాన్న గారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్ల‌వేళలా ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను." అని బాల‌కృష్ణ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.