English | Telugu

మహేష్ బాబు సినిమా నేను చేసుంటే బాగుండేది..కల్కి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు 

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో ఉత్తమాభిరుచిగల దర్శకుడిగా ముద్ర వేసుకున్న మేకర్ నాగ్ అశ్విన్(Nag Ashwin)ఆ తర్వాత ప్రభాస్(Prabhas)తో తెరకెక్కించిన మైథలాజికల్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడి' తో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని మరింతగా పెంచాడు. ప్రస్తుతం కల్కి పార్ట్ 2 కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.

రీసెంట్ గా నాగ్ అశ్విన్ కొంత మంది కాలేజీ స్టూడెంట్స్ తో జరిగిన ఇంటర్వ్యూ లో సినిమా ఇండస్ట్రీలో తనకున్న అనుభవాలని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతు నేను హీరోల్ని బట్టి కథ రాసుకోను. కథ రాసుకున్నాకే హీరోని సెలక్ట్ చేసుకుంటాను. ఆ విధంగానే కల్కి లో క్యారెక్టర్స్ అనుకున్నాకే, మొదట అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత ప్రభాస్ ని సెలెక్ట్ చేశాను. కొన్ని ప్రాజెక్టులకి ఎడిటర్ గా వర్క్ చేశాను. సినిమా బాగా రావడానికి ఎడిటింగ్ కూడా చాలా ముఖ్యం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'ఖలేజా' మూవీకి నేను ఎడిటింగ్ చేస్తే బాగుండేదని చెప్పుకొచ్చాడు.

త్రివిక్రమ్(Triviram)దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'ఖలేజా'(Khaleja)2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మహేష్ పెర్ఫార్మెన్సు తో పాటు మిగతా నటీనటుల పెర్ ఫార్మెన్స్ కామెడీ, త్రివిక్రమ్ డైలాగ్స్ అండ్ డైరెక్షన్ ఎక్స్ ఆర్డినరీ గా ఉంటాయి.సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి.కానీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి మహేష్ అభిమానులకి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖలేజా కి నేను ఎడిటింగ్ చేసుంటే బాగుండేదనే నాగ్ అశ్విన్ ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.