English | Telugu

ప్రభాస్ చేయాల్సిన 'స్టూడెంట్ నెం.1' ఎన్టీఆర్ చేశాడు!

'నిన్ను చూడాలని'(2001) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్.. తాను నటించిన రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1'తో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. స్వప్న సినిమా(వైజయంతి మూవీస్) నిర్మించిన ఈ సినిమాతోనే ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి ఇక వెనక్కి తిరిగి చూస్కోకుండా స్టార్స్ గా ఎదిగారు. అయితే నిజానికి ఈ సినిమాలో మొదట ప్రభాస్ ని హీరోగా అనుకున్నారట.

'రాజకుమారుడు'(1999)తో మహేష్ బాబు, 'చిరుత'(2007)తో రామ్ చరణ్.. వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే హీరోలుగా పరిచయమయ్యారు. అయితే నిజానికి ప్రభాస్ కూడా 'స్టూడెంట్ నెం.1' సినిమాతో వైజయంతి ద్వారానే పరిచయం కావాల్సి ఉండగా మిస్ అయింది. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ రివీల్ చేశారు.

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న అశ్వినీదత్.. 'స్టూడెంట్ నెం.1' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట ఆ సినిమాని ప్రభాస్ తో చేయాలనుకున్నామని, కానీ చాలా చర్చల తర్వాత చివరికి తారక్ తో చేశామని అన్నారు. ప్రభాస్ 2002 లో వచ్చిన 'ఈశ్వర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ 'స్టూడెంట్ నెం.1' చేసినట్లయితే ఒక ఏడాది ముందే సూపర్ హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉండేవాడు.

అయితే 'స్టూడెంట్ నెం.1' భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ.. రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాల్లో తనకు ఆ ఒక్క సినిమా నచ్చదని గతంలో ఓ సినిమా వేడుకలో ప్రభాస్ చెప్పడం విశేషం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.