English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. 'సలార్' అప్డేట్ వచ్చేస్తోంది!

'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు నిరాశపరిచాయి. దీంతో ఆయన తర్వాతి సినిమాలపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అన్నీ భారీ ప్రాజెక్ట్ లే ఉన్నాయి. ముఖ్యంగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్'పై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ సర్ ప్రైజ్ రాబోతోంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అన్నీ భారీ ప్రాజెక్ట్ లే ఉండటంతో ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పెద్దగా రావట్లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే ఇప్పుడు వారికొక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రెండు రోజుల్లో సలార్ కి సంబంధించిన కీలక అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గ్లింప్స్ లేదా టీజర్ కి సంబంధించిన అప్డేట్ అయ్యుండొచ్చని అంటున్నారు. గత ఏడాది 'సలార్' నుంచి రెండు ప్రభాస్ లుక్ పోస్టర్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు సడెన్ గా రెండు రోజుల్లో అప్డేట్ రాబోతున్నట్లు తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.