English | Telugu
థాయ్‌లాండ్ లో జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్..!
Updated : Jun 13, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 10 కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ అయిందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా జెట్ స్పీడ్ లో షూటింగ్ ని పూర్తి చేసే పనిలో మూవీ టీం ఉందట.
ప్రస్తుతం 'దేవర' షెడ్యూల్ గోవాలో జరుగుతోంది. రీసెంట్ గా జరిగిన భారీ యాక్షన్ సీక్వెన్స్ చితీకరణలో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. గోవా షెడ్యూల్ జూన్ 15 వరకు జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే.. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా చిత్ర బృందం థాయ్‌లాండ్ వెళ్తుంది. జూన్ 17 నుంచి అక్కడ ఓ సాంగ్ షూట్ జరగనుంది. ఈ రొమాంటిక్ మెలోడీని ఎన్టీఆర్-జాన్వీ పై చిత్రీకరించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. జులై నాటికి మొత్తం షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న 'దేవర' చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.