English | Telugu

ఇది ప్రభాస్ రేంజ్.. 'ఆర్ఆర్ఆర్' రికార్డు బద్దలుకొట్టిన 'కల్కి'...

ప్రస్తుతం ఇండియాలో కొత్త రికార్డులు సృష్టించాలన్నా, ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలన్నా తానే అనే స్థాయికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేరుకున్నాడు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే.. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమనేలా పరిస్థితి ఉంది. తన తాజా చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) తోనూ ప్రభాస్ రికార్డుల వేటలో పడిపోయాడు.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి'. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. విడుదలకు ముందే 'కల్కి' చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది.

ఉత్తర అమెరికాలో ప్రీ సేల్స్‌ పరంగా 'కల్కి' సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. చాలా తక్కువ సమయంలో 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకుంది. ప్రీ సేల్స్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ మార్క్ ని అందుకున్న ఇండియన్ సినిమాగా ఇప్పటిదాకా 'ఆర్ఆర్ఆర్' పేరిట ఉన్న రికార్డుని.. తాజాగా 'కల్కి' తన ఖాతాలో వేసుకుంది. విడుదలకు రెండు వారాల ముందే ఈ ఫీట్ సాధించిన 'కల్కి'.. ఇదే జోరు కొనసాగిస్తే.. ప్రీ సేల్స్ తో పాటు, ఫుల్ రన్ లోనూ కళ్ళు చెదిరే రికార్డులు సృష్టించే అవకాశముంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.