English | Telugu

ముగ్గురికి అత్య‌వ‌స‌రం

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్, హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్, హీరోయిన్ కాజ‌ల్... ఈ ముగ్గురి కాంబినేష‌న్ లో వ‌స్తున్న తాజా సినిమా టెంప‌ర్. ఈ సినిమాపై భారీగా అంచ‌నాలున్నాయి. ఎందుకంటే ముగ్గురికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. కానీ కొద్దికాలంగా స‌రైన హిట్లే లేవు. అందుకే ఆ ముగ్గురూ సినిమాను హిట్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. అన్నింటికి మించి ఈ సినిమా హిట్ కావ‌డం ముగ్గురికి అత్య‌వ‌స‌రం. ఎందుకంటే కొంత‌కాలంగా పూరీకి భారీ హిట్ లేదు. ఎన్టీఆర్ దీ అదే ప‌రిస్థితి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్టుగా త‌యారైంది ఎన్టీఆర్ కెరీర్. మంచి పెర్ఫార్మ‌ర్ అయినా మంచి సినిమా ప‌డ‌డం లేదు. అది ఎందుకో ఎవ‌రికీ అర్థం కానీ ప‌రిస్థితి. ఇక హీరోయిన్ కాజ‌ల్ హిందీపైనే ఫోక‌స్ పెట్ట‌డం వ‌ల్ల తెలుగులో అవ‌కాశాలు త‌గ్గించుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ తెలుగుపై ఇంట్రెస్ట్ పెట్టి ఇక్క‌డా త‌న మార్కెట్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని చాటుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇలా ఏర‌కంగా చూసినా ఈ ముగ్గురికీ అర్జెంటుగా ఒక్క హిట్ కావాలి. అందుకే ముగ్గురూ ఈ సినిమాను చాలా సీరియ‌స్ గా తీసుకుంటున్నార‌ని సినీజ‌నాలు గుసుగుస‌లాడుకుంటున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.