English | Telugu

సీత‌మ్మ‌కు ల‌క్కీ ఛాన్స్!

గీతాంజ‌లి త‌రవాత తెలుగమ్మాయి అంజ‌లి తెర‌పై క‌నిపించ‌లేదు. అటు త‌మిళంలోనూ అమ్మ‌డికి అవ‌కాశాల్లేకుండా పోయాయి. అంజ‌లి కెరీర్ ఏమైపోతోందో అనుకొంటున్న త‌రుణంలో ఆమెకు మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. అయితే ఇది అలాంటిలాంటి అవ‌కాశం కాదు.. అనుష్క స్థాయి క‌థానాయిక చేయాల్సిన పాత్ర అంజ‌లి పాప‌ని వెదుక్కొంటూ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు అశోక్‌.. అనుష్క కోసం భాగ్‌మ‌తి అనే స్ర్కిప్టు త‌యారు చేసుకొన్నారు. ఇందులోనూ.... క‌త్తి యుద్దాలు, గుర్ర‌పు స్వారీ వ‌గైరా వ‌గైరా ఉంటాయి. క‌థ న‌చ్చినా త‌న కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక ఈ సినిమాని వ‌దులుకొంది అనుష్క‌. మ‌రి అనుష్క పాత్ర‌లో ఎవ‌రైతే బాగుంటారు?? అని అన్వేషించిన అశోక్‌కి.. అంజ‌లి క‌నిపించింది. ఈ క‌థ అంజ‌లికీ న‌చ్చి వెంట‌నే ప‌చ్చ‌జెండా ఊపేసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి. అంజ‌లి భాగ్ మ‌తిగా ఎలా ఉంటుందో..? ఈ సినిమా ఆమె కెరీర్‌ని ఏ విధంగా మారుస్తుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.