English | Telugu

అదృష్ట‌మంటే హాసినిదే

హాసిని గుర్తుందా.. బొమ్మ‌రిల్లు సినిమాలో హాసిని క్యారెక్ట‌ర్ తో మంచి గుర్తింపు పొందిన జెనీలియా... బాలీవుడ్ న‌టుడు రితేశ్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే అంటే 25 న‌వంబ‌ర్ రోజున ఈమె పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది. త‌ల్లీ, బిడ్డ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. శ‌నివారం రోజు జెనీలియా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఆ ఫోటోలు బ‌య‌టికొచ్చాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫోజులిస్తూ జెన్నీ సంద‌డి చేసింది.

పెళ్లి త‌ర్వాత జెనీలియా సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ముందూ సినిమాల్లో న‌టించే అవ‌కాశం కూడా లేద‌ని ఆమె స‌న్నిహితులు చెబుతుంటారు. ఏదేమైనా త‌న జ‌న‌రేష‌న్ హీరోయిన్లు ఇంకా సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే కొన‌సాగుతూ డ‌క్కామొక్కీలు తింటుంటే ... జెనీలియా మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. హాసిని పెళ్లి చేసుకున్న వ్య‌క్తి కూడా మామూలు కుటుంబానికి చెందిన వ్య‌క్తి కాదు. ఆమె భ‌ర్త పేరు రితేశ్ దేశ్ ముఖ్.... మహారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ త‌న‌యుడు. అన్నింటికి మించి రితేశ్ బాలీవుడ్ న‌టుడు. వ‌రుస సినిమాల‌తో మంచి గుర్తింపు పొందాడు. ఇలాంటి భ‌ర్త‌.... ఆపైన పండంటి బాబు... ఇంత‌కంటే ఓ అమ్మాయికి కావాల్సింది ఏముంది...ఎంతైనా అదృష్ట‌మంటే జెన్నీదే. అది రీల్ లైఫ్ లో అయినా.. రియ‌ల్ లైఫ్ లో అయినా...

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.