English | Telugu
సంగీత దర్శకుడు చక్రి మృతి: చిత్రసీమ దిగ్భ్రాంతి
Updated : Dec 15, 2014
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40) ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. దాదాపు 90 చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన తొలి చిత్రం బాచి. ఎర్రబస్సుకీ ఆయన స్వరాలు సమకూర్చారు. చక్రి మరణవార్త వినగానే చిత్రలోకమంతా షాక్‌కి గురైంది. ఆదివారం అర్థరాత్రి వరకూ ఆయన రికార్డింగ్‌పనులతో బిజీగా గడిపారు. తెల్లవారుఝామున గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే ఆయన మరణించారు. హుషారుపాటలకే కాదు, మెలొడీ గీతాలకూ చక్రి ప్రసిద్ది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఎన్నో హిట్ చిత్రాలకు బాణీలు అందించారు. ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, సత్యం, ఢీ, మస్కా, దేవదాసు... ఇలా ఎన్నో హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. సింహా చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకొన్నారు. చక్రి మృతి పట్ల.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులో తెలంగాణ చిత్రపరిశ్రమ ఓ గొప్ప సంగీత దర్శకుడ్ని కోల్పోయిందన్నారు. చక్రి మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా షాక్ తిన్నారు. చక్రి స్వగృహంలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకొన్నాయి.